Back to home
Silent Dawn
Acoustic

Silent Dawn

R
Rani Sadasiva Murty
0 likes1 plays4:44
Style: peaceful

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

శివుడంటె  జీవుడేనూ

గీత రచన - ఆచార్య రాణి సదాశివ మూర్తి

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

ఈ జంగమము శివుడు

ఈ స్థావరము శివుడు

కనిపించి కనిపించకున్న

దేవుడు శివుడు ।।

ఈనేల ఆనింగి

అగ్గి గాలీ నీరు

సూరీడు చందురుడు

ఆసామి శివుడేను ।

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

కనిపెంచు తల్లి యును

కాపాడు తండ్రి యును

బుద్ధి గరపే ఒజ్జ

చెలికాడు శివుడేను ।।

ఉచ్ఛ్వాస నిఃశ్శ్వాస

జీవనాడుల హేష

సంసారమున ఘోష

నా ధ్యాస శివుడేను ।।

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

పూజలన్నిట శివుడు

పేరులన్నిట శివుడు

తపములన్నిట శివుడు

తాపమ్ము శివుడేను ।। శివుడంటె।।

విత్తు తానే శివుడు

చెట్టు తానే శివుడు

వనము తానే శివుడు

నీడ తానే శివుడు ।।

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

అన్నమైనా శివుడు

ఆకలైనా శివుడు

కలి తాను చలి తాను

నా దన్ను శివుడేను ।।

నాదమ్ము లో శివుడు

ధ్యానమ్ములో శివుడు

నంది నేనై కొలిచి

నాది యందున శివుడు ।।

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

మొదలు తానే శివుడు

తుదకు మిగిలే శివుడు

కాలునంతము చేయు

కారుచిచ్చే శివుడు।।

శివుడంటె  జీవుడేనూ

శివుడంటె నీవు నేనూ

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!