
Sunlit Groove
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Chorus]
సేవంటే కాదురా సంపాదనకు మార్గం
సిలువ కాడితో సాగే భారమైన ప్రయాణం
సేవంటే కాదురా సుఖవంతమైన జీవనం
హింసనొందుచూ సాగే సద్భక్తి జీవితం
[Verse]
గమనించుము సోదరా క్రీస్తు వార్త ప్రచార
గ్రహించుము సోదరా వాక్య సత్యం మనసారా
[Verse 1]
దివ్యమైన సేవను ధనార్జనకు వాడకు
దేవుని ఘననామమును దూషణపాలు చేయకు
దేవునికి సిరికి నీవు దాసునిగా ఉండకు
దీనుడవై ధన్యునిగా చేరుము పరము కడకు
॥ గమనించుము॥
[Verse 2]
దేవదేవుని మందను ప్రేమతో కాయుము
దుర్లాభాపేక్షను దూరముగా ఉంచుము
ధనాపేక్ష కీడులకు మూలమని ఎరుగుము
ధనము విస్తరించి నీవు చేరవు పరలోకము
॥ గమనించుము॥
[Verse 3]
పేరు ప్రతిష్ఠలను కోరి పరిచర్యను చేయకు
పొగడ్తలను ఆశిస్తూ ప్రభు సేవలో కొనసాగకు
కష్టాలు ఎదురైనా ఎన్నడు నీవు క్రుంగకు
కన్నీటి ప్రార్థనతో కడవరకు కొనసాగు
॥ గమనించుము॥
[Verse 4]
వెండి బంగారాలకు చేయి ఎన్నడు చాపకు
వెలకట్టలేని సేవను నిత్యము నీవు మరువకు
వాక్యము వక్రీకరించి వంచన బోధ చేయకు
విలువైన క్రీస్తు ప్రభుని
బహుమానంనొదలకు
॥ గమనించుము॥
[Verse 5]
కారులు షికారులు విదేశీ విహారాలు
కోట్లు లక్షలు లోకాశకు చిరునామాలు
అపోస్తలుల సేవయే అన్నింటా ఆదర్శం
ఆత్మదేవుని శక్తియే ప్రభు సేవకు పరమార్థం
॥ గమనించుము॥