
Dancing Through Yesterday
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
[Verse 1]
మబ్బుల్లో చందమామ ముచ్చటగా మెరిసినపుడు, వెన్నెల కాసింది..
సిగ్గుల్లో చిన్నదాని చిరునవ్వే విరిసినపుడు, పువ్వై పూసింది..
పూసిన పువ్వుల పైన కాసిన వెన్నెల కథ చెపుతాను వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... హే... వింటామయ్యో వింటాము!
[Verse 1]
గంగలా జలపాతం వెండికొండ జారినపుడు, జల్లె కురిసింది..
సింగంలా నా మామ సిన్న బండి తోలినపుడు, ఒళ్ళే మురిసింది..
మురిసిన వంటిపై కురిసిన జల్లు కథ చెపుతాను వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... హే... వింటామమ్మో వింటాము!
[Interlude]
[Upbeat Dappu and Dholak beat with Flute]
[Verse 2]
పచ్చని సేలల్లో పక్షులన్ని వాలినపుడు, సందడి తోచింది..
సందెవేళ సైగ చేసి సిన్నది నన్ను పిలిసినపుడు, సరదా పెరిగింది..
సెట్టుపైన వాలిన పక్షి జంట ప్రేమ కథ చెపుతాను వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... హే... వింటామయ్యో వింటాము!
[Verse 2]
[SFX: Raindrops]
వాగుల్లో తుంటరి సినుకు అల కన్యను లేపింది
నీ కొంటె కళ్ళు కొరుకుతుంటే నా వయసే ఊగింది..
ఎలిసిన వానల్లో తడిసిన ఆ జంట కథ చెపుతాను వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... వింటామమ్మో వింటాము!
[Verse 3]
కొప్పులోని మల్లెపూవు గుబాళించి నవ్వినపుడు,
ఘల్లుమనే గాజుల ఘల్లుల మోతిన్నప్పుడు
గడ్డ కట్టే గుండె కథ చెపుతాను వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... హే... వింటామయ్యో వింటాము!
[Outro]
[Both Vocal Duet]
మబ్బుల్లో చందమామ ముచ్చటగా మెరిసినపుడు, వెన్నెల కాసింది..
సింగంలా నా మామ సిన్న బండి తోలినపుడు, ఒళ్ళే మురిసింది..
మనసుల మురిపెం లోనా దాగిన ప్రేమల కథ చెపుతా వింటావా ..వింటావా!
[Chorus]
ఏలేలో ఏలేలో... వింటామయ్యో... వింటామమ్మో... హేయ్!