
Raag Darbari
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
అమ్మా! మాతా,
శుభ గాయత్రీ!
సకల జనులకు
ప్రియ జనయిత్రీ!
మధుర మోహన
సుందర గాత్రీ !
పిల్లల మమ్మా
మోహన గాత్రీ!
నీ పిల్లల మమ్మా
నాల్గు వేదముల
సారము నీవే
ఐదు ముఖముల
అమ్మవు నీవే
ముగ్గురమ్మల
మూలము నీవే
ఐశ్వర్యాలకు
నెలవే నీవు
కోరిన కోర్కెలు
తీర్చే తల్లీ !
వరముల నెన్నో
ఒసగే తల్లీ!
కొలిచిన వారికి
కొంగు బంగారమా !
తలచిన వెంటనే
పలికే తల్లీ!
రాజూ ....పేదా ...
తలతురు తల్లీ !
కూలీ ....నాలీ.....
కొలుతురు తల్లీ !
ప్రేమతో నిన్నూ
ఎవరు వేడినా.....
అందింతువు నీ
అభయ హస్తము!.
హంస వాహనీ!
మధుర భాషిణి!
అమర లోకాన
సత్య వాసినీ!
వేదాల తల్లివి !
మా పాల వెల్లివి !
పరమ పవిత్రం ,
గాయత్రి మంత్రం!
చదువుల నొసగే
చదువుల తల్లీ!
ఓ గాయత్రీ!
సంపద లొసగే
సిరి గల తల్లీ!
ఓ గాయత్రీ!
ధైర్య సాహసము
లొసగిన పార్వతి!
ఓ గాయత్రీ!
అమ్మలందరికి
అమ్మవు నీవే!
ఓ గాయత్రీ !
అఖిల జగాలకే
అమ్మవు నీవే !
ఓ, గాయత్రీ!