Back to home
Golden Rain In Lagos
Orchestral

Golden Rain In Lagos

working workworking work
0 likes1 plays5:50
Style: afrobeat, drums, brass, guitar, 110 bpm, groovy, african, polyrhythmic, Orchestral, , male vocal, violin, sad

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

(పల్లవి)

నమ్మిన బంధమే నన్ను నడిరోడ్డున నిలిపిందే

నువ్విచ్చిన ప్రేమే నన్ను నాలోనే చంపిందే

నా ఇంటి దీపమై వెలిగావనుకున్నా

నా గుండే గోడలకే చీకటిని తెచ్చావా…

(చరణం 1)

నీ చూపుల్లో దాగిన మరో కథ తెలిసింది

పెళ్లిలో నేను లేనప్పుడు ఇంకొకడితో పరిచయం చూపులు

నేను వచ్చాక వాడే కావాలని నీలో మొదలైన తపన

నా ముందే దాచిన ఆ చూపులన్నీ నన్ను గుచ్చాయే

నాతో బంధం ఉన్నా… నీ మనసు వాడికే చేరిపోయిందే…

నిన్ను చూసిన ప్రతి క్షణం

ఇప్పుడు గుండెలో మిగిలింది ఒక గాయం

నిన్ను నమ్మిన నా మనసే అడుగుతోంది

“నాతో ప్రేమా… లేక నటనా?”

(చోరస్)

మోసం చేసినా… మౌనం ఉండనా?

బంధం చంపినా… నిన్ను క్షమించనా?

నా ఇంటి మనిషే నా గుండెను గుచ్చితే

ఈ జీవితాన్నే ఎలా నమ్మను?

(చరణం 2)

విరిగిన నా మనసు వేదనతో నిండింది…

నమ్మిన నన్నే వెధవని చేశావు…

నాకు తెలియదని నువ్వు… అతడూ భ్రమలో ఉన్నారు…

మీ ఇద్దరి మోసం నా కళ్లముందే నిలిచింది…

నాకు తెలియదని నువ్వు అనుకున్నావే…

కానీ అన్నీ తెలిసినవాడినే నేను…

నీ రహస్య అడుగుల శబ్దం వినిపించిన వేళ

నా కలలన్నీ కూలిపోయాయే ఒక్కసారిగా

నా జీవితంలో నువ్వు పరాయివైపోయావే

నా ఇంట్లోనే నేను పరాయివాడినయ్యానే…

(చరణం 3)

ప్రేమ అడిగితే మౌనం ఇచ్చావు

నిజం అడిగితే అబద్ధం చెప్పావు

నమ్మకం పెట్టిన గుండెను

నువ్వే ముక్కలుగా చేశావు…

నీ నవ్వులో దాగిన రహస్యం తెలిసింది

నీ నడకలో మారిన దూరం తెలిసింది

నన్ను చూస్తూ నటించిన ఆ ప్రేమంతా

నిజం కాదని నా గుండె చెప్పింది…

(చరణం 4)

నా ముందే సైగలు… చూపులు చూసావే

నా గుండెలో బాణంలా నీ మోసం గుచ్చిందే

వాడు వచ్చిన ప్రతిసారీ నీ వంకే చూస్తాడే

నువ్విచ్చిన చనువు… వాడికి నచిందే

వాడితో గడిపిన సమయం… మాటలన్నీ గమనించానే

నీ ప్రతి అడుగులో దాగిన అర్థాన్ని తెలుసుకున్నానే

"నీ కోరిక చూపులు… నీ పెదవుల తాకిడి"

చెప్పకనే చెప్పేశాయి నీ మనసులోని నిజాన్ని

నాకు తెలియదని నువ్వు అనుకున్నావే…

కానీ నీ ప్రతి మోసం నేను గమనించానే

నమ్మిన నా గుండెను నువ్వే గాయపరిచావే

నా జీవితంలో మిగిలింది నీడగా ఈ బాధే…

(బ్రిడ్జ్)

ఇక నీ కోసం కన్నీరు కార్చను

ఇక నీ మాటల్ని నమ్మను

విరిగిన బంధం తిరిగి కట్టను

నన్ను నేను మళ్లీ కోల్పోను…

(ఫైనల్ హుక్)

నమ్మకమే చనిపోయిన మనసులో

ప్రేమ ఎలా బతుకుతుంది

నీ జ్ఞాపకం

ఒక గాయంగా మిగిలిపోతుంది…

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!