Back to home
Whispered Dawn
Acoustic

Whispered Dawn

hudson paulhudson paul
0 likes1 plays3:38
Style: Soulful vocals, Acoustic, female vocal, piano, guitar, violin, flute, peaceful

PRO & Creator Features

Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).

Audio2Audio Remix

Pro & Creator

Voice Clone

Pro & Creator

Create Variations

Creator only

Edit Sections

Creator only

Stem Separation

Creator only

Lyrics

▶ Play this song to follow along.

అన్ని కాలంబుల నున్న యెహోవా నీ

నెన్నదరంబయో కన్న తండ్రి

వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుత

లున్నతమై యుండ మున్నె నీకు

నిన్ను ప్రకటనా సేయ నిఖిల లోకములను

బన్నుగ జేసిన బలుడవీవే

ఉన్న లోకంబుల నుడుగక కరుణా సంపన్నతతో

నేలు ప్రభుడవీవే

అన్ని జీవుల నెరిగి యాహారమిచ్చుచు

నున్న సర్వజ్ఞుండవు నీవే

ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల

సన్నుతించుటకు నే జాలుదునా

అన్ని కాలంబుల నున్న యెహోవా నీ

నెన్నదరంబయో కన్న తండ్రి

వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుత

లున్నతమై యుండ మున్నె నీకు

పుట్టింప నీవంచు పోషింప నీవంచు

గిట్టింప నీవంచు కీర్తింతును

నట్టి పనికి మాలి నట్టి మానవులచే

పట్టి రక్షింప బాధ్యుండవంచు

దట్టమైన కృపను దరిజేర్చ నాకిచ్చి

పట్టయి నిలచియుండు ప్రభుడవంచు

గట్టడచే గడ ముట్టుదనుక నా

పట్టుకొలది నిన్ను స్తుతింతు

అన్ని కాలంబుల నున్న యెహోవా నీ

నెన్నదరంబయో కన్న తండ్రి

వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుత

లున్నతమై యుండ మున్నె నీకు

కారుణ్యనిధి వీవు కఠినాత్ముడను నేను

భూరి శుద్ధుడవు వీవు పాపి నేను

సార భాగ్యుడవు వీవు జగతిలో

నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడ

సార సద్గుణముల సంపన్నుడవు నీవు

ఘోర దుర్గుణ సంచారి నేను

ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు

నేరమెన్నక ప్రోవ నెర నమ్మితి

అన్ని కాలంబుల నున్న యెహోవా నీ

నెన్నదరంబయో కన్న తండ్రి

వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుత

లున్నతమై యుండ మున్నె నీకు

అన్ని కాలంబుల నున్న యెహోవా నీ

నెన్నదరంబయో కన్న తండ్రి

Comments(0)

Sign in to join the conversation.

No comments yet. Be the first to comment!