
అదిగో అమరావతి
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
అదిగో అదిగదిగో
ఆంధ్రుల అభిమాన రాజధాని అమరావతి-2
నవ్యాంధ్ర చాణిక్యుడైన
చంద్రబాబు సృష్టించిన స్వర్ణాంధ్ర రాజధాని ఈ అమరావతి .-2......అదిగో అదిగదిగో ...
త్రిమూర్తలాంశ దారులైన
త్రికూటమి నాయకులైన,
మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషి ఫలితమే
ఈ దివ్య నగరం అమరావతి
ఆ సుర వరుల రాజధాని అయిన
ఆ అమరావతిని మించిన సౌందర్యంతో
అద్భుత రూపముతో నవ్యాంధ్రలో వెలసిన
దైవ నగరము ఈ అమరావతి … ...... అదిగో అదిగదిగో
బౌద్ధ భిక్షువులు నడచిన భూమి
మహాపురుషుడైన గౌతమబుద్ధుని అవశేషములపై నిర్మించిన
పుణ్య స్థూపము గా వెలసిన భూమి-2
శాతవాహన, శాలి వాహన, రెడ్డి రాజులు రాయలు ఏలిన భూమి-2
గోదారి కృష్ణమ్మ పెన్నమ్మ తుంగభద్రలు ప్రవహించి
సస్యశ్యామలమై హరిత విప్లవముతో పాడిపంటలతో
అలరించిన నవ్యాంధ్ర భూమి …ఈ సీమాంధ్ర భూమి .....
..అదిగో అదిగదిగో-
హాలికులను కన్న భూమి
కవితాలికులైన నన్నయ్య తిక్కన వేమన
అన్నమయ్య గురుజాడ గిడుగు గుర్రము ఝాషువా లాంటి
మహనీయులను కన్న భూమి….
అమరవీరులు
పొట్టి శ్రీరాములు పుట్టి నడిచిన నేల
మన జాతీయ జెండా ను సృష్టించిన
పింగళి జన్మించిన భూమి -2
కందుకూరి టంగుటూరి
బెజవాడ కాసు నీలము నందమూరి నారా వారు వైయస్సార్లు
జన్మించిన భూమి మనసీమాంధ్ర భూమి .... అదిగో అదిగదిగో-
-2-
ఖ్యాతికి నీతికి నిలచిన నేల
జాతి వెలుగులను కన్న నేల
ఈ నవ్యాంధ్ర నేల -2
వీరులను కన్న భూమి
వీర నారీమణు లకు జన్మనిచ్చిన పుణ్య భూమి -2
తిరుమల తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం
విజయవాడ లాంటి యెన్నో పుణ్యక్షేత్రముల పుడమి-2
కళలతో వెలిగే కళా కారులైన
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న
నట సామ్రాట్టులు జన్మించిన కళల క్షేత్రం ఈ భూమి….
మన సీమాంధ్ర భూమి-2
సాగర తీరమున సుసంపదతో
సుందర నగరము గావెలసిన
నవ్యాంధ్ర రాజధాని అమరావతి …
వెలగాలి భువిలో అమరావతి అజారా మరమై
భువిలో వెలగాలి మన అమరావతి ….
…………అదిగో అదిగదిగో