
Heaven In Rhythm
PRO & Creator Features
Unlock advanced AI features with Pro (Audio2Audio, Voice Clone, Photo Covers, LoRA) or Creator (Variations, Edit Sections, Stem Separation).
Audio2Audio Remix
Pro & Creator
Voice Clone
Pro & Creator
Create Variations
Creator only
Edit Sections
Creator only
Stem Separation
Creator only
Lyrics
▶ Play this song to follow along.
ఎన్నడూ తలంచని జీవితం నాకిచ్చినావే,
ఊహకందని నీ కృపలో నను నిలిపినావే,
ఏ మంచీ లేని నన్ను నీవు ప్రేమించినావే,
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందునే?
నా జీవ నాయకా! సర్వలోక పాలకా! నా యేసువా!
చరణం 1:
మనుషుల ప్రేమకు నోచుకోని నన్నే,
నేను సైతం ఇష్టపడని నా బ్రతుకునే,
సిలువలో నీ రక్తమిచ్చి కొనినావే,
ఆత్మరక్షణ భాగ్యమిచ్చి బ్రోచినావే.
చరణం 2:
పనికిరాని నన్ను నీవు పిలిచినావే,
బలహీనతను బాపి బలము నిచ్చినావే,
ఊహకందని వాటిని నాకొసగినావే,
నీదు సేవలోన నన్ను వాడుకున్నావే.
చరణం 3:
శత్రువుల ప్రేమకు పాత్రుని చేసినావే,
నా బ్రతుకున ఎత్తుపల్లాలను సరిచేసినావే,
నిరుపయోగిని నీ సేవకు ఉపయోగించినావే,
నిరాశలో నా చేయి వదలని దేవుడవే.